పసిడి మళ్లీ భారం  యల్లోమెటల్‌ ధరలు ఒడిదుడుకులతో సాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధరలు పెరగడంతో దేశీ మార్కెట్‌లోనూ గురువారం పసిడి ధరలు భారమయ్యాయి. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 292 రూపాయలు పెరిగి 50,340 రూపాయలు పలికింది. కిలో వెండి 775 రూపాయలు భారమై 61,194 రూపాయలకు ఎగబాకింది.