'కలర్ ఫొటో'కి స్టార్స్ ప్రశంసలు.. రెండుసార్లు చూసిన 'నాని'థియేటర్లు మూసి ఉన్న కారణంగా సినిమాలన్నీ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ ద్వారా విడుదల అవుతున్నాయి. ఐతే ఇప్పటి వరకు ఓటీటీలో రిలీజైన చాలా చిత్రలకి అంత పెద్దగా స్పందన రాలేదనే చెప్పాలి. కానీ ఒక్క సినిమాకి మాత్రం ఓ రేంజిలో స్పందన వస్తుంది. అదే కలర్ ఫోటో. యాక్టర్ సుహాస్ హీరోగా నటించిన ఈ సినిమాని హృదయ కాలేయం సినిమాతో పేరు తెచ్చుకున్న సాయి రాజేష్ నీలం నిర్మించారు. కొత్త దర్శకుడు సందీప్ రాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించాడు.  ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రానికి అటు ప్రేక్షకుల నుండి ఇటు సినిమా ఇండస్ట్రీ నుండి మంచి స్పందన వస్తుంది. స్టార్ హీరోలు, దర్శకులు సైతం కలర్ ఫోటోని పొగుడుతున్నారు. స్టార్ క్యాస్టింగ్ లేకుండా తెరకెక్కిన ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రశంసలు దక్కుతున్నాయి. అదీగాక ఇప్పటి వరకూ ఆహాలో ఎక్కువ మంది చూసిన సినిమాగా కలర్ ఫోటోనే ఉందని సమాచారం. ఈ లెక్కన చూసుకుంటే కలర్ ఫోటో పెద్ద హిట్టనే చెప్పాలి. ఓటీటీలో ఈ రేంజ్ స్పందన రావడమంటే బ్లాక్ బస్టర్ అనక తప్పదు. చాందినీ చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ చిత్రానికి కాలభైరవ సంగీతం అందించారు.