నేడు అసెంబ్లీ సమావేశం  శాసనసభ, శాసనమండలి సమావేశా లను ఒక్కోరోజు చొప్పున మాత్రమే నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించిన నేపథ్యంలో మంగళవారం శాసనసభ, బుధ వారం శాసనమండలి భేటీ జరగనుంది. భేటీ ఒకరోజు మాత్రమే కాబట్టి ప్రశ్నోత్తరాలు, జీరో అవర్‌ లాంటి అంశాల జోలికి వెళ్లకుండా ఎజెండాను మాత్రమే చేపట్టే అవకాశం ఉంది. సమావేశాల ఏర్పాట్లపై శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. కోవిడ్‌ నేపథ్యంలో శాసనసభ, మండలి సమావేశ మందిరాల్లో సీటింగ్‌ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత నెల 6 నుంచి 16వ తేదీ వరకు జరిగిన అసెంబ్లీ సమావేశాల తరహాలోనే సభ్యుల మధ్య భౌతికదూరం ఉండేలా సీటింగ్‌ విధానం కొనసాగించాలని, శాసనసభ ప్రాంగణంతో పాటు, సభ లోపల కూడా పూర్తిస్థాయిలో శానిటైజేషన్‌ చేయించా లని అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహా చార్యులను ఆదేశించారు. ఏర్పాటు చేయా ల్సిన బందోబస్తుపై రాష్ట్ర డీజీపీ మహేందర్‌ రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌లతో ఫోన్‌ ద్వారా సమీక్షించారు. అవసరమైన సమాచా రంతో సిద్ధంగా ఉండాలని ప్రభుత్వ కార్యదర్శి సోమేశ్‌ కుమార్‌కు ఫోన్‌లో సూచించారు.