కన్నీళ్లు పెట్టిస్తున్న ఉల్లి

 
ప్రస్తుతం మార్కెట్లో ఉల్లిగడ్డ రేటు కన్నీళ్లు పెట్టిస్తోంది. రోజురోజుకూ ధర పెరిగిపోవడంతో ఉల్లిని కొనలేకపోతున్నారు. కానీ ఇలా ఉల్లి రేటు పెరగడానికి కారణం మన దేశంలో వాటిని నిల్వ చేసే పద్ధతి సరిగా లేకపోవడమే అంటారు మహారాష్ట్రకు చెందిన 23ఏళ్ల కళ్యాణి షిండే. దానికోసం ''గోదామ్‌"అనే కంపెనీ ద్వారా సంప్రదాయ గిడ్డంగులను స్మార్ట్ గిడ్డంగులుగా మారుస్తున్నారు. రైతుల కన్నీళ్లు తుడుస్తున్నారు. ప్రపంచంలో ఉల్లిగడ్డల ఉత్పత్తిలో మన దేశం రెండో స్థానంలో ఉంది. పది లక్షల మెట్రిక్ టన్నులకు పైనే ఉల్లిగడ్డలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తోంది. మహారాష్ట్రలోనే ఎక్కువగా ఉల్లిని పండిస్తారు. కానీ అక్కడ వాటిని నిల్వచేసే గోడౌన్లు ఉన్నా ఉత్పత్తి పాడవకుండా మాత్రం చూడలేకపోతున్నారు రైతులు. దానివల్ల ఎంత ఎక్కువ పంట పండిస్తున్నా నష్టాలపాలవుతూనే ఉన్నారు. ఐఓటీ సెన్సర్ల ద్వారా.. గోడౌన్లలో నిల్వ ఉండే ఉల్లిని పాడవకుండా ఉంచడమంటే చాలా కష్టం. ఎందుకంటే ఒక గడ్డ పాడైతే మిగిలిన అన్ని గడ్డలూ పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకే ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్(ఐవోటీ) టెక్నాలజీని ఉపయోగించడం