విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడులు


నేడు(6న) దేశీ స్టాక్‌ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభమయ్యే అవకాశముంది. ఇందుకు సంకేతంగా ఉదయం 8.20 ప్రాంతంలో ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ 45 పాయింట్లు పుంజుకుని 11,572 వద్ద ట్రేడవుతోంది. సోమవారం ఎన్‌ఎస్‌ఈలో నిఫ్టీ అక్టోబర్‌ ఫ్యూచర్స్‌ 11,527 వద్ద స్థిరపడింది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ ఫ్యూచర్‌ కదలికలను.. ఎస్‌జీఎక్స్‌ నిఫ్టీ ప్రతిఫలించే సంగతి తెలిసిందే. సోమవారం యూఎస్‌ మార్కెట్లు 2 శాతం స్థాయిలో బలపడ్డాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లు 0.5-1 శాతం మధ్య లాభాలతో ట్రేడవుతున్నాయి. వరుసగా రెండు రోజులపాటు ర్యాలీ చేసిన నేపథ్యంలో నేడు దేశీ స్టాక్‌ మార్కెట్లు ఆటుపోట్ల మధ్య కదలవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. రెండో రోజూ జోరు గత వారం చివర్లో హైజంప్‌ చేసిన దేశీ స్టాక్‌ మార్కెట్లు సోమవారం మరోసారి దూకుడు చూపాయి. సెన్సెక్స్‌ 277 పాయింట్లు లాభపడి 38,974 వద్ద ముగిసింది. నిఫ్టీ 86 పాయింట్లు పుంజుకుని 11,503 వద్ద నిలిచింది. తొలి నుంచీ ఇన్వెస్టర్లు కొనుగోళ్లకే ఆసక్తి చూపడంతో ఒక దశలో సెన్సెక్స్‌ 39,264 వరకూ ఎగసింది. నిఫ్టీ సైతం 11,578 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.