దీపికను విచారించిన అధికారికి కోవిడ్‌


బాలీవుడ్‌ నటుడు సుశాంత్‌ రాజ్‌ పుత్‌ మరణంతో సంబంధముందని భావిస్తున్న బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి గత నెలలో దీపికా పదుకొనెను విచారించిన నార్కోటిక్స్‌ కంట్రోల్‌ బ్యూరో (ఎన్సీబీ) డిప్యూటీ డైరెక్టర్‌ కేపీఎస్‌ మల్హోత్రాకు కరోనా పాజిటివ్‌ అని తేలింది. బాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి ఎన్సీబీ ఇప్పటికే దీపికా పదుకొనె, శ్రద్ధా కపూర్, సారా అలీఖాన్, రకుల్‌ ప్రీత్‌లను విచారించింది. వీరంతా డ్రగ్స్‌ వాడకాన్ని వ్యతిరేకించామని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి మరికొందరిని విచారించాల్సి ఉండటంతో, వీరిని తిరిగి విచారణకు పిలిచే అవకాశాలుు ఉన్నాయని అధికారులు చెప్పారు.