ఈ కథలో పాత్రలు కల్పితం

 


 పవన్ తేజ్‌ కొణిదెల హీరోగా పరిచయమవుతున్న చిత్రం ‘ఈ కథలో పాత్రలు కల్పితం’. అభిరామ్‌ ఎమ్‌. దర్శకత్వంలో మాధవి సమర్పణలో రాజేష్‌ నాయుడు నిర్మించారు. మేఘన హీరోయిన్‌గా నటించారు. ఈ సినిమాలోని ‘కన్నయే కళ్లు..’ ఫస్ట్‌ లిరికల్‌ వీడియో సాంగ్‌ని డైరెక్టర్‌ సురేందర్‌ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రాజేష్‌ నాయుడు మాట్లాడుతూ –‘‘థ్రిల్లింగ్‌ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. పవన్ తేజ్‌కి ఒక పర్ఫెక్ట్‌ లాంచింగ్‌ మూవీ అవుతుందని భావిస్తున్నాం. మా చిత్రం ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుపుకుంటోంది. సునీల్‌ కుమార్‌ విజువల్స్, తాజుద్దీన్ సయ్యద్‌ మాటలు మా చిత్రానికి హైలైట్‌’’ అన్నారు. ‘‘రాజేష్‌ నాయుడుగారి సహకారంతోనే సినిమాను రిచ్‌గా తీయగలిగాం. ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది. త్వరలోనే సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అభిరామ్‌.ఎమ్‌ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కార్తీక్‌ కొడకండ్ల, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: కృష్ణ పామర్తి.