ప్రజలు గుంపులుగా చేరకుండా పర్యవేక్షణకు ఏర్పాట్లు  వినోదపు పార్కులు, ఫుడ్‌కోర్టుల్లో సీసీటీవీలు ఏర్పాటుచేసి సందర్శకులు గుంపుగా ఒకేచోటకు చేరకుండా పర్యవేక్షించాలని కేంద్ర ప్రభు త్వం ఆదేశించింది. కరోనా కంటైన్మెంట్‌ ఏరియాల్లో వినోదపు పార్కులు తెరవ కూడదని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ తాజాగా మార్గదర్శకాలు జారీచేసింది. కరోనా వ్యాప్తి జరగకుండా వినోదపు పార్కుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొంది. వినోద కేంద్రాలకు, పార్కుల్లోకి సందర్శకులు విశ్రాంతి, వినోదం కోసం పెద్దసంఖ్యలో వస్తారు. కాబట్టి కరోనా నివారణ చర్యలు పాటించడం చాలా ముఖ్యమని నొక్కిచెప్పింది.