ఆస్ర్టేలియాలోని టౌన్స్ విల్లే పట్టణంలో బతుకమ్మ వేడుకలు  ఆస్ర్టేలియాలోని టౌన్స్ విల్లే పట్టణంలో బతుకమ్మ వేడుకలను నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా బతుకమ్మలను పేర్చి.. మహిళలు ఆడిపాడారు. ఈ వేడుకలకు టౌన్స్ విల్లే పట్టణంలోని తెలంగాణ వారంతా హాజరయ్యారు. తెలంగాణ మహిళలంతా ఒకేచోట చేరి బతుకమ్మ వేడుకలను నిర్వహించుకోవడం సంతోషంగా ఉందని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకల్లో కొవిడ్ నిబంధనలు పాటించారు.