భారీ బడ్జెట్తో ప్రభాస్ సినిమాలు


బాహుబలి ముందు వరకు ప్రభాస్ కేవలం సౌత్ స్టార్ గా మాత్రమే ఉండేవాడు కాని ఎప్పుడైతే బాహుబలి రిలీజైందో అప్పుడే తన క్రేజ్ పెరిగింది. సౌత్ స్టార్ గా ఉన్న ప్రభాస్ కాస్త నేషనల్ స్టార్ గా మారాడు. బాహుబలి తర్వాత సాహో సినిమాను కూడా ప్రభాస్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేశాడు. అయితే ఆ సినిమా మాత్రం ఆశించిన స్థాయిలో అంచనాలను అందుకోలేదు. ప్రస్తుతం ప్రభాస్ రాధే శ్యాం, ఆదిపురుష్ సినిమా చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ సినిమా కూడా లైన్ లో ఉంది. ఈ సినిమాలు కూడా దాదాపు 400 కోట్ల బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారని తెలుస్తుంది. ఇవే కాదు ప్రభాస్ తో సినిమా అంటే 300 కోట్ల బడ్జెట్ ఉండాల్సిందే అని ఫిక్స్ అయ్యారట. నిర్మాతలకు కూడా ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా రిలీజ్ మినిమం బడ్జెట్ 300 కోట్లు అని చెబుతున్నారట. ఆ కండీషన్ ఓకే అనుకుంటేనే ప్రభాస్ తో సినిమా అని తెలుస్తుంది. అందుకే ప్రభాస్ వరుస సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అవుతున్నాయి. సో మొత్తానికి ప్రభాస్ ఇప్పుడు తెలుగు హీరోగా కాకుండా నేషనల్ స్టార్ గా సూపర్ టాలెంట్ చూపిస్తున్నాడు. ప్రస్తుతం కమిటైన సినిమాలతో పాటుగా యశ్ రాజ్ బ్యానర్ లో ధూం 4 లో కూడా ప్రభాస్ నటిస్తాడని టాక్. అదే జరిగితే మాత్రం ప్రభాస్ రేంజ్ మరింత పెరిగే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తుంది.