స్టాండెలోన్ లఘు–బీమా కంపెనీల ప్రారంభ స్థాయి మూలధన నిబంధనలను సడలించాలని బీమా రంగ నియంత్రణ, అభివృద్ధి సంస్థ ఐఆర్డీఏఐ భావిస్తోంది. ఇప్పటిదాకా రూ. 100 కోట్లుగా ఉన్న పరిమాణాన్ని రూ. 20 కోట్లకు తగ్గించాలని ఐఆర్డీఏఐ ఏర్పాటు చేసిన కమిటీ సిఫార్సు చేసింది. దేశీయంగా బీమా మార్కెట్‌ను మరింతగా విస్తృతం చేసే ఉద్దేశంతో, లఘు బీమాను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సూచించేందుకు ఐఆర్డీఏఐ ఈ కమిటీని ఏర్పాటు చేసింది. ‘కరోనా వైరస్ మహమ్మారితో లక్షల కొద్దీ ప్రజలు జీవనోపాధి కోల్పోయి పేదరికంలోకి జారిపోతున్న నేపథ్యంలో తాజా సిఫార్సులను సత్వరం అమలు చేయాల్సిన అవసరం ఉంది‘ అని కమిటీ తన నివేదికలో పేర్కొంది.