చేతిలో బీర్‌ గ్లాస్‌.. ఈ అమ్మాయి గుర్తుందా


ప్రేక్షకుల స్టాండ్‌లో.. చేతిలో బీర్‌ గ్లాస్‌తో...ఆవేశంగా పంచ్‌ విసురుతూ వీరాభిమానం ప్రదర్శిస్తున్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..! మహిళల టెన్నిస్‌ వరల్డ్‌ నంబర్‌వన్, ప్రస్తుతం జరుగుతున్న ఫ్రెంచ్‌ ఓపెన్‌ గ్రాండ్‌స్లామ్‌ టోర్నీలో డిఫెండింగ్‌ చాంపియన్‌ కూడా అయినా యాష్లే బార్టీ ఉత్సాహమిది. కరోనా కారణంగా ఫ్రెంచ్‌ ఓపెన్‌ ఆడలేనంటూ తప్పుకున్న ఆమె ఇప్పుడు స్వదేశంలో జరుగుతున్న ఆస్ట్రేలియన్‌ ఫుట్‌బాల్‌ లీగ్‌ (ఏఎఫ్‌ఎల్‌)ను ప్రేక్షకురాలిగా ఎంజాయ్‌ చేస్తోంది. క్వీన్స్‌లాండ్‌కు చెందిన 24 ఏళ్ల బార్టీ శుక్రవారం ‘గాబా’ స్టేడియంలో రిచ్‌మండ్‌ క్లబ్‌తో తలపడిన తన అభిమాన జట్టు బ్రిస్బేన్‌ లయన్స్‌కు మద్దతిస్తూ ఇలా కనిపించింది.