సన్‌రైజర్స్‌ జట్టుకు పృథ్వీరాజ్‌ ఎంపిక  యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్‌–2020లో పేసర్‌ భువనేశ్వర్‌ స్థానంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టుకు ఎంపికైన యర్రా పృథ్వీరాజ్‌ తెనాలి కుర్రోడు. తొడ కండరాల గాయంతో భువనేశ్వర్‌ ప్రసాద్‌ ఐపీఎల్‌ నుంచి నిష్క్రమించగా, అతడి స్థానంలో 22 ఏళ్ల ఎడమచేతి వాటం పేస్‌ బౌలర్‌ పృథ్వీరాజ్‌కు అవకాశం లభించింది. గతేడాది ఐపీఎల్‌కు ఆడిన అనుభవం, ప్రాక్టీస్‌ మ్యాచ్‌ల్లో అద్భుతంగా బౌలింగ్‌ చేస్తున్న అతడిని భువికి సరైన ప్రత్యామ్నాయంగా జట్టు భావించింది. కరోనా కారణంగా జట్టుతో పాటే ‘బయో సెక్యూర్‌ ఎన్విరాన్‌మెంట్‌’ (బయో బబుల్‌)లో ఉంటున్నందున క్వారంటైన్‌తో పని లేకుండానే పృథ్వీరాజ్‌ జట్టులో ఆడనున్నాడు.