ఫ్రెంచ్‌ ఓపెన్‌ గెలుచుకున్న టీనేజర్‌

 


 ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ టైటిల్‌ను ఇగా స్వియాటెక్‌ (పోలండ్‌) గెలుచుకుంది. శనివారం ఏకపక్షంగా జరిగిన ఫైనల్లో స్వియాటెక్‌ 6–4, 6–1 తేడాతో నాలుగో సీడ్‌ సోఫియా కెనిన్‌ (అమెరికా)ను చిత్తు చేసింది. గంటా 24 నిమిషాల్లో ఈ మ్యాచ్‌ ముగిసింది. ఈ టోర్నీకి ముందు 54వ ర్యాంక్‌తో అన్‌సీడెడ్‌గా బరిలోకి దిగిన పోలండ్‌ ప్లేయర్‌ తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 17వ స్థానానికి చేరుకునే అవకాశం ఉంది. విజేతగా నిలిచిన స్వియాటెక్‌కు 16 లక్షల యూరోలు (సుమారు రూ. 13 కోట్ల 82 లక్షలు), రన్నరప్‌గా నిలిచిన కెనిన్‌కు 8 లక్షల యూరోలు (సుమారు రూ. 7 కోట్ల 34 లక్షలు) ప్రైజ్‌మనీగా లభించాయి.