హీరోయిన్‌ తమన్నాకు కరోనా పాజిటివ్ : హాస్పిటల్ లో చేరిన తమ్మన్నా


కరోనా వైరస్మహమ్మారి ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు. ముఖ్యంగా రాజకీయ, వ్యాపార, సినీ రంగ సెలబ్రిటీలు పలువురు కోవిడ్19 బారిన పడుతున్నారు. ఇటీవల గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా బారిన పడి అనంతరం కోలుకున్నా ప్రయోజనం లేకపోయింది. తాజాగా టాలీవుడ్ నటి తమన్నా భాటియా కరోనా బారిన పడింది. కరోనా లక్షణాలు కనిపించడంతో కోవిడ్19 టెస్టులు నిర్వహించారు. తాజాగా వచ్చిన కోవిడ్19 ఫలితాలలో తమన్నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారించారు. టాలీవుడ్ నటి తమన్నాకు కరోనా పాజిటివ్ గా తేలడంతో చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చేరినట్లు సమాచారం. మిల్కీ బ్యూటీ తమన్నాకు కరోనా సోకందన్న వార్త తెలుసుకున్న ఆమె అభిమానులు షాక్ అవుతున్నారు.కాగా, కొన్ని రోజుల కిందట తమన్నా తల్లిదండ్రులకు వైరస్ లక్షణాలు కనిపించడంతో కుటుంబం మొత్తం కరోనా పరీక్షలకు వెళ్లింది. కోవిడ్19 ఫలితాలలో తమన్నా తల్లిదండ్రులకు కరోనా పాజిటివ్‌గా తేలింది. కొందరు సిబ్బందికి సైతం కరోనా పాజిటివ్‌గా తేలగా.. తమన్నాకు మాత్రం అప్పుడు నెగిటివ్‌ అని వచ్చింది. తాజాగా నిర్వహించిన కోవిడ్19 టెస్టులలో నటి తమన్నాకు పాజిటివ్‌ వచ్చింది.