విమానయాన సంస్థ జెట్ ఎయిర్వేస్ ఇండియా టేకాఫ్‌కు ముందడుగు పడింది. కొత్త యజమానుల చేతుల్లోకి సంస్థ మారనుంది. లండన్‌కు చెందిన ఫైనాన్షియల్ అడ్వైజరీ అయిన కల్రాక్ క్యాపిటల్, వ్యాపారవేత్త మురారీ లాల్ జలాన్‌ల కన్సార్షియం జెట్ పగ్గాలను చేపట్టబోతోంది. జెట్‌ను కొనుగోలు చేసే ప్రక్రియలో భాగంగా రుణ పరిష్కార ప్రణాళికకై ఈ కన్సార్షియం ఆఫర్ చేసిన బిడ్‌ను జెట్ రుణ సంస్థల కమిటీ ఆమోదం తెలిపింది. కంపెనీ ఈ విషయాన్ని శనివారం వెల్లడించింది. కల్రాక్–జలాన్‌ల కన్సార్షియం బిడ్‌లో భాగంగా బ్యాంకులకు జెట్ ఎయిర్వేస్లో వాటాతో పాటు రూ.850 కోట్లు ఆఫర్ చేసినట్టు తెలుస్తోంది.