‘పెళ్లి కల వచ్చేసిందే కాజల్‌..’

 


 ‘పెళ్లి కల వచ్చేసిందే కాజల్‌..’ అంటూ కాజల్‌ అగర్వాల్‌ అభిమానులు సంబరపడిపోతున్నారు. దక్షిణాది స్టార్‌ హీరోయిన్‌లలో ఒకరైన కాజల్‌ని ‘మీ పెళ్లెప్పుడు?’ అని అడిగితే, ‘పెళ్లి కుదిరినప్పుడు స్వయంగా నేనే చెబుతా’ అని చెప్పేవారు. తాజాగా తాను పెళ్లి చేసుకోబోతున్న విషయాన్ని సోషల్‌ మీడియా వేదికగా స్పష్టం చేశారీ బ్యూటీ. గౌతమ్‌ కిచ్లు అనే ఇంటీరియర్‌ డిజైనర్, వ్యాపారవేత్తను ఆమె మనువాడనున్నారు. ‘‘గౌతమ్‌ కిచ్లుని ఈ నెల 30న పెళ్లి చేసుకుని కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నాననే వార్తను మీతో పంచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. ముంబైలో సింపుల్‌గా జరిగే మా పెళ్లి వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే పాల్గొంటారు.