నో రిలాక్స్
బంతి బౌండరీ దాటిందని రిలాక్స్‌ అవడమో, క్రీజులోకి వచ్చామనే భ్రమలో ఉండటంతోనో లేక అతితొందరతోనో బ్యాట్స్‌మన్‌ రనౌట్‌ అవుతుంటారు. నిర్లక్ష్యంతో కూడా బ్యాట్స్‌మన్‌ కూడా రనౌట్లు అవుతూ ఉండటం చాలానే చూశాం. స్ట్రైకింగ్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌ పరుగు తీయడానికి నాన్‌స్టైకింగ్‌ ఎండ్‌లో ఉన్న బ్యాట్స్‌మన్‌కు పిలుపు ఇవ్వడం, ఆపై వెంటనే నిర్ణయాన్ని మార్చుకుని స్టైకింగ్‌ బ్యాట్స్‌మన్‌ వెనక్కి వెళ్లిపోవడం ఆ క్రమంలోనే ఎవరో ఒకరు బలి అయిపోవడం మనకు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. తాజాగా ఇదే తరహా రనౌట్‌ సోషల్‌ మీడియలో వైరల్‌గా మారింది