ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాలీ సేల్‌.. ఫోన్లపై ;భలే ఆఫర్లు.. ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ఇటీవలే దసరా పండుగ నేపథ్యంలో బిగ్ బిలియన్ డేస్ సేల్ ను నిర్వహించిన విషయం విదితమే. కాగా దీపావళి పండుగను పురస్కరించుకుని అక్టోబర్ 29 మధ్యాహ్నం నుంచి బిగ్ దివాలీ సేల్‌ను నిర్వహించనుంది. అయితే ఈ సేల్ నేటి అర్థరాత్రి నుంచే ఫ్లిప్ కార్ట్ ప్లస్ మెంబర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ సేల్‌లో అనేక ఆఫర్లు, డిస్కౌంట్లను అందివ్వనున్నారు.  ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్ నవంబర్ 4 వరకు కొనసాగనుంది. ఇందులో పోకో, మోటోరోలా, రియల్‌మి తదితర అనేక కంపెనీలకు చెందిన ఫోన్లపై భారీ రాయితీలను అందివ్వనున్నారు. యాక్సిస్ బ్యాంక్‌తో ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యం అయింది. అందువల్ల ఆ బ్యాంక్ కస్టమర్లు ఆ కార్డులపై ఇన్‌స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. సేల్‌లో రియల్‌మి నార్జో 20 ప్రొ 6జీబీ, 64జీబీ వేరియెంట్ ధర రూ.14,999కు బదులుగా రూ.13,999 గా ఉండనుంది. అలాగే 8జీబీ, 128 జీబీ వేరియెంట్ కూడా రూ.1వేయి తగ్గింపు ధరకు లభిస్తుంది. రియల్‌మి సి11 రూ.7499కు బదులుగా రూ.6,999కు, రియల్‌మి సి15 ఫోన్ 3జీబీ, 32జీబీ వేరియెంట్ రూ.9,499కు బదులుగా రూ.8,999 కు లభిస్తుంది. అలాగే రియల్‌మి 6 సిరీస్ ఫోన్ల ప్రారంభ ధర రూ.12,999గా ఉండనుంది.  పోకోలో పోకో సి3, పోకో ఎం2, పోకో ఎం2 ప్రొ, పోకో ఎక్స్‌2 ఫోన్లపై తగ్గింపు ధరలను పొందవచ్చు. యాక్సిస్ బ్యాంక్ కార్డులు అయితే 10 శాతం అదనపు డిస్కౌంట్ ఇస్తారు. మోటోరోలాకు చెందిన మోటో వన్ ఫ్యుషన్ ప్లస్‌, మోటో జి9, మోటో ఇ7 ప్లస్ ఫోన్లను తగ్గింపు ధరలకు కొనవచ్చు. ఐఫోన్ ఎక్స్ఆర్ 64జీబీ రూ.39,999 ధరకు, ఐఫోన్ ఎస్ఈ 2020 64జీబీ రూ.32,999 ధరలకు లభిస్తాయి.  సేల్‌లో భాగంగా రూ.54,990 విలువ గల ఎల్‌జీ జీ8ఎక్స్ కేవలం రూ.24,990కే లభిస్తుంది. నవంబర్ 3న మధ్యాహ్నం 12 గంటలకు దీనికి ఫ్లాష్ సేల్ నిర్వహిస్తారు. అలాగే ఒప్పో, వివో, శాంసంగ్‌, షియోమీ, ఇన్ఫినిక్స్‌, నోకియా, టెక్నో, హానర్ ఫోన్లను కూడా తగ్గింపు ధరలకు అందివ్వనున్నారు.