స్మార్ట్‌ఫోన్లలో క్వాడ్‌ కెమెరాల జోరు

 


 అల్ట్రా నైట్‌ మోడ్, బ్యూటిఫికేషన్, హైబ్రిడ్‌ జూమ్‌.. ఇప్పుడు ఇటువంటి ఫీచర్స్‌ గురించే స్మార్ట్‌ఫోన్‌ కస్టమర్లు చర్చించుకుంటున్నారు. సామాజిక మాధ్యమాలు దైనందిన జీవితంలో భాగం కావడంతో ఫొటోలకు ప్రాధాన్యత పెరిగింది. అమూల్యమైన సందర్భాలను, సంఘటనలను చేతిలో ఉన్న ఫోన్‌తో ‘క్లిక్‌’మనిపించి సామాజిక మాధ్యమాల ద్వారా స్నేహితులతో షేర్‌ చేసుకుంటున్నారు. దీంతో సంప్రదాయ కెమెరాల స్థానాన్ని స్మార్ట్‌ఫోన్లు భర్తీ చేస్తున్నాయి. 10 ఏళ్లలో కెమెరాల అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా 94 శాతం తగ్గాయంటే.. మొబైల్‌ ఫోన్లలో కెమెరా సెన్సార్స్, ఫీచర్స్‌ ఏ స్థాయిలో ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు.