గంగూభాయ్‌ బిజీబిజీ


సంజయ్‌ లీలా భన్సాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్యాంగ్‌స్టర్‌ డ్రామా చిత్రం ‘గంగూభాయ్‌ కతియావాడీ’. ఆలియా భట్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాలో వివిధ వయసుల్లో ఉన్న పాత్రల్లో ఆలియా కనిపిస్తారు. కోవిడ్‌ బ్రేక్‌ తర్వాత ఈ సినిమా చిత్రీకరణను ఇటీవలే ప్రారంభించారు. ముంబైలో నిర్మించిన ప్రత్యేక సెట్స్‌లో చిత్రీకరణ జరుపుతున్నారు. లాక్‌డౌన్‌ ముందు సుమారు 250 మంది యూనిట్‌తో చిత్రీకరణ జరిపారు. తాజాగా వంద కంటే తక్కువ మందితో షూటింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం ముంబైలో ఏకధాటిగా రాత్రి పగలు చిత్రీకరణలో గంగూభాయ్‌ టీమ్‌ బిజీబిజీగా ఉంది. ఈ సినిమాలో అజయ్‌ దేవగన్‌ కీలక పాత్ర చేస్తున్నారు. వచ్చే ఏడాదిలో రిలీజ్‌ ప్లాన్‌ చేస్తున్నారు.