నయా చాలెంజ్‌.. కొత్త లుక్‌లో పొలార్డ్‌

 
 ముంబై ఇండియన్స్‌ స్టార్‌ ప్లేయర్‌ కీరోన్‌ పొలార్డ్‌ నయా లుక్‌లో కనిపిస్తున్నాడు. తన మొత్తం గడ్డాన్ని తీసేసి కేవలం ఫ్రెంచ్‌ కట్‌లో కనిపిస్తూ ముంబై ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. తన సహచర ఆటగాడు హార్దిక్‌ పాండ్యా విసిరిన ‘బ్రేక్‌ ద బియార్డ్‌’ చాలెంజ్‌లో భాగంగా కొత్త పోలీ కనిపిస్తున్నాడని పొలార్డ్‌ పేర్కొన్నాడు. ఈ మేరకు ఒక వీడియోను పొలార్డ్‌ షేర్‌ చేశాడు. తొలుత గడ్డాన్ని చూపించిన పొలార్డ్‌.. ఆపై ఫ్రెంచ్‌ కట్‌లో కనిపించాడు. ఈ చాలెంజ్‌కు కేకేఆర్‌ కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్‌ను నామినేట్‌ చేశాడు పొలార్డ్‌.