తెరపైకి వర్చువల్‌ ఆడియో సినిమాలు


అందరికీ వినోదం పంచే ‘సినిమా’ కాలానుగుణంగా తన రూపాన్ని మార్చుకుంటూనే ఉంది. నాటి బ్లాక్‌ అండ్‌ వైట్, మూకీ సినిమాలు మొదలు ప్రస్తుత త్రీడీ, యానిమేటెడ్‌ మూవీస్‌ వరకు కొత్తదనాన్ని, నూతన సాంకేతికతను తనలో కలుపుకుంటూనే ఉంది. సినిమాని కేరీర్‌గా ఎంచుకునే యువతరం పెరగడంతో షార్ట్‌ఫిల్మ్‌ హవా కూడా పెరిగింది. పొట్టి ఫ్లాట్‌ఫార్మ్‌పై తమదైన ముద్ర వేయాలనే తపనతో యువత కొత్త ప్రయోగాలు చేస్తున్నారు. అదే క్రమంలో వినూత్న వర్చువల్‌ ఆడియో ఫిల్మ్‌ తెరపైకి వచ్చింది. ప్రయోగాలకు వెనుకంజ వేయని నగర యువతను తన వైపు ఆకర్షిస్తోంది.. ఈ తరహా ఫిల్మ్‌లపై దృష్టి పెట్టేందుకు లాక్‌డౌన్‌ టైమ్‌ వారికి ఉపయోగపడింది.