ములుగు జిల్లాలో వారం రోజుల్లో రెండోసారి అలజడి రేగింది. మంగపేట మండలం నర్సింహసాగర్ పరిధి ముసలమ్మగుట్ట సమీపంలో గ్రేహౌండ్స్ బలగాలు, మావోయిస్టుల మధ్య ఆదివారం జరిగిన ఎదు రు కాల్పుల్లో మావోయిస్టు మణుగూరు ఏరియా దళ కమాండర్ సుధీర్ అలియస్ రాముతో పాటు ఒక దళ సభ్యుడు మృతి చెందినట్లు జిల్లా ఎస్పీ సంగ్రాంసింగ్ పాటిల్ తెలిపారు. వారి వద్ద ఒక ఎస్ఎల్ఆర్, రెండు ఇతర వెపన్స్ లభించినట్లు చెప్పారు. ఇటీవల వెంకటాపురం(కె) మండలం బోధాపురంలో టీఆర్ఎస్ నాయకుడు మాడూరి భీమేశ్వరావు(48)ను మావోలు హతమార్చారు. తాజా ఎన్కౌంటర్ ఘటన మన్యంలో మళ్లీ అలజడి నెలకొంది.