మజగావ్‌ డాక్‌ లిస్టింగ్‌ అదరహో

 


 ప్రభుత్వ రంగ మజగావ్‌ డాక్‌ షిప్‌ బిల్డర్స్‌ షేర్‌ స్టాక్‌ మార్కెట్‌ లిస్టింగ్‌లో మెరుపులు మెరిపించింది. ఈ షేర్‌ ఇష్యూ ధర రూ.145తో పోల్చితే 49 శాతం లాభంతో రూ. 216 వద్ద బీఎస్‌ఈలో లిస్టయింది. చివరకు 19 శాతం లాభంతో రూ. 173 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌ ముగిసేసరికి ఈ కంపెనీ మార్కెట్‌ క్యాప్‌ రూ.3,489 కోట్లుగా ఉంది. బీఎస్‌ఈలో 36 లక్షలు, ఎన్‌ఎస్‌ఈలో 4 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఇటీవలే ముగిసిన ఈ కంపెనీ ఐపీఓ 157 రెట్లు ఓవర్‌ సబ్‌స్క్రైబయింది.