మళ్లీ ఉగ్రరూపం దాల్చిన మూసీ నది  నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మూసీ నది మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. ఛాదర్ ఘాట్ బ్రిడ్జితో సహా పక్కకు ఉన్న బస్తీలను మూసీ ముంచేసింది. 50కి పైగా పేదల ఇళ్లు వరద నీటిలో మునిగిపోయాయి. చదర్‌ఘాట్‌ నుండి మలక్‌పేట్‌, దిల్‌సుఖ్‌ నగర్‌ ప్రధాన రోడ్ బంద్ అయింది. ఆ పక్కనే ఉన్న బస్తీలు మొత్తం నీట మునిగిపోయాయి. దీంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. నాయకులు, జీహెచ్‌ఎంసీ అధికారులు ఎవరూ వచ్చి తమని చూడలేదంటూ జనం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.