రష్మిక, అల్లు అర్జున్ ల పుష్ప షూటింగ్ షురూ

 


అల్లు అర్జున్, రష్మిక కాంబినేషన్ లో వస్తోన్న చిత్రం పుష్ప. సుకుమార్ డైరెక్షన్ లో వస్తోన్న ఈ చిత్రషూటింగ్ లాక్ డౌన్ ఎఫెక్ట్ తో నిలిచిపోయింది. నవంబర్ నుంచి షూటింగ్ రీస్టార్ట్ చేయాలని ప్లాన్ చేసుకుంది సుకుమార్ అండ్ టీం. సుమారు ఏడు నెలల విరామం తర్వాత రష్మిక, అల్లు అర్జున్ షూటింగ్ షురూ చేసేందుకు రెడీ అవుతున్నారు. ప్రధాన తారాగణంపై వచ్చే సన్నివేశాల చిత్రీకరణ కోసం త్వరలో పుష్ప టీం విశాఖపట్నంకు వెళ్లనుందట.  2021 మొదలయ్యేనాటికి సినిమాను పూర్తి చేయాలని భావిస్తున్నాడట అల్లు అర్జున్. ఫిల్మ్ షూటింగ్ షెడ్యూల్‌పై చిత్రయూనిట్ అధికారికంగా ప్రకటించనుంది. ఈ సినిమాలో రష్మిక మందన్నా ఫారెస్ట్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. కేరళ అడవుల్లో ప్రధాన భాగం షూట్ చేయాల్సి ఉండగా..కోవిడ్ ప్రభావంతో షూటింగ్ ను నిలిపేశారు.