ఫామ్‌లో లేని అతడినే ఆడిస్తామంటే కుదరదు


పేలవ ఫామ్‌లో ఉన్న షేన్‌ వాట్సన్‌ను చెన్నై తప్పిస్తుందా అని చాలా మంది అడుగుతున్నారు. కానీ ధోని గురించి తెలిసిన వారెవరైనా ‘లేదు’ అనే సమాధానం ఇస్తారు. ఎందుకంటే అది ధోని శైలి కాదు. అయితే తనకు ఇష్టం లేకపోయినా జట్టులో మార్పులు చేస్తాడని గత మ్యాచ్‌ చూపించింది. చహర్, కరన్, బ్రేవో ఉన్నా సరే తనకు ఐదుగురు బౌలర్ల అవసరం ఉంటుందని గుర్తించి శార్దూల్‌ను హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ధోని తీసుకున్నాడు. దీనివల్ల జడేజా రెండు ఓవర్లు వేసినా సరిపోయింది. మంచి కెపె్టన్‌ ఎవరైనా పరిస్థితులను బట్టి తన ఆలోచనలను మార్చుకుంటాడు. ఇందుకు టీమ్‌లో భారీ మార్పులు చేయాల్సిన అవసరం లేదు. తుది జట్టును పదే పదే మార్చే కోహ్లితో పోలిస్తే ధోని భిన్నమని మనకు అర్థమవుతుంది.