బుకింగ్స్ లో మహీంద్ర థార్ దూకుడు


మహీంద్ర అండ్ మహీంద్ర కొత్తగా మార్కెట్లోకి తీసుకొచ్చిన ఎస్‌యూవీ 2020 మహీంద్రా థార్ బుకింగ్స్ లో దూసుకుపోతోంది. కరోనా సంక్షోభంలో వాహన విక్రయాలు భారీగా పడిపోయాయి. లాక్ డౌన్ నిబంధనల సడలింపు అనంతరం డిమాండ్ స్వల్పంగా పుంజుకున్నప్పటికీ, ఆటో కంపెనీలు ఇంకా ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో సరికొత్త మహీంద్రా థార్‌కు భారత మార్కెట్ నుంచి భారీ స్పందన లభిస్తోంది. కేవలం మూడు రోజుల్లోనే 9 వేల బుకింగ్స్ ను సాధించామని కంపెనీ తాజాగా ప్రకటించింది.