ఐఫోన్ యూజర్లకు శుభవార్త  టెక్ దిగ్గజం ఆపిల్ ఐఫోన్ యూజర్లకు శుభవార్త అందించింది. ముందుగా ప్రకటించినట్టుగానే సంగీతం, ఫోటోగ్రఫీ, ఆర్ట్ పై ఆసక్తి ఉన్నవారి కోసం ఉచిత వర్చువల్ సెషన్లను షురూ చేసింది. ఇటీవల భారతదేశంలో ఆపిల్ స్టోర్ ఆన్‌లైన్ ప్రారంభించిన ఆపిల్ తన ఐఫోన్‌ వినియోగదారులలో అప్ కమింగ్ కళాకారులకు ఈ సెషన్లలో ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. ఈ వర్చువల్ సెషన్‌కు మీ ఐఫోన్ సిద్ధంగా ఉండండి అని ఆపిల్ పేర్కొంది. నవంబర్ 29 వరకు ఉచిత వర్చువల్ సెషన్లను ప్రకటించింది. ప్రముఖ స్థానిక ఫోటోగ్రాఫర్‌లు, ప్రసిద్ధ సంగీతకారులు వారి వారి విజయ గాథలను పంచుకుంటారు. ఈ ఆపిల్ ఈవెంట్‌ల కోసం నమోదు చేసుకున్న వినియోగదారులకు చిట్కాలు , సలహాలు అందిస్తారు. ఈ క్రమంలో ముందుగా ఫోటోగ్రఫీ సెషన్ల వివరాలను ఆపిల్ ప్రకటించింది.