గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాల విడుదల ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ, వార్డు సచివాలయాల పరీక్షా ఫలితాలను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ మోహన్‌రెడ్డి మంగళవారం విడుదల చేశారు. ఏపీలోని 13 శాఖల్లో మిగిలిపోయిన 16,208 పోస్టుల భర్తీకి సెప్టెంబర్ 20 నుంచి 26 తేదీ వరకు ఏపీ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షలు నిర్వహించారు.16,208 పోస్టులకు గానూ మొత్తం 7,68,965 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. అయితే సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు పరీక్ష జరిగిన మరుసటి రోజు నుంచే సెస్టెంబర్ 21 నుంచి సెప్టెంబర్ 27 వరకు అత్యంత వేగంగా ఓఎంఆర్‌లను స్కాన్ చేశారు. గతేడాది ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ, వార్డు సచివాలయాల్లో మొదటి విడత లక్షకు పైగా పోస్టుల్ని భర్తీ చేశారు. అప్పుడు ఉద్యోగాల్లో చేరినవారు మానెయ్యడం, ఉద్యోగాల్లో చేరకపోవడం లాంటి కారణాల వల్ల 16,208 ఖాళీలు ఏర్పడ్డాయి.