ఐపీఎల్‌ అభిమానులకు డబుల్‌ మజా


ఇప్పటిదాకా విజయాల పరంగా, ఆటగాళ్ల పరంగా సమఉజ్జీలుగా నిలిచిన రెండు జట్ల మధ్య జరిగే పోరులో బ్యాటా, బంతా ఏది పైచేయి సాధిస్తుందో చూడాలి. కోల్‌కతా నైట్‌రైడర్స్, ఢిల్లీ క్యాపిటల్స్‌ చెరో మూడు మ్యాచ్‌లు ఆడాయి. రెండింట నెగ్గి ఒక్కో మ్యాచ్‌లో ఓడిపోయాయి. కానీ ఈ సీజన్‌లో ఈ రెండు ప్రత్యర్థులు తలపడటం ఇదే మొదటిసారి. ఇక పోటీ విషయానికొస్తే యువకులు, విదేశీ ఆల్‌రౌండర్ల సమతూకంగా ఉన్న రెండు జట్ల మధ్య శనివారం రాత్రి ఆసక్తికర మ్యాచ్‌ జరగడం ఖాయం. కెప్టెన్‌ దినేశ్‌ కార్తీక్, శుబ్‌మన్‌ గిల్, రసెల్, మోర్గాన్‌లతో కూడిన కోల్‌కతా, రిషభ్‌ పంత్, స్టొయినిస్, కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌లు ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.