మైక్రో సాఫ్ట్ ఉద్యోగులకు శుభవార్త. కరోనా నేపథ్యంలో ఇచ్చిన వర్క్ ఫ్రం హోంను ఇకపై శాశ్వతంగా చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ సంస్థ శనివారం ప్రకటించింది. అయితే ఈ అవకాశం కొన్ని విభాగాల్లో పనిచేసే ఉద్యోగులకు మాత్రమే ఇస్తున్నట్లు స్పష్టం చేసింది. మహమ్మారి బారిన ఉద్యోగులు పడకకుండా ఉండేందుకు పలు ఐటీ కంపెనీలతో సహా ఇతర రంగాలకు చెందిన సంస్థలు ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం అవకాశం కల్పించిన విషయం తెలిసిందే. వర్క్ ఫ్రం హోంతో మైక్రోసాఫ్ట్‌తో పాటు ఇతర కంపెనీలు లాభపడినప్పటికి కోవిడ్ ప్రభావం తగ్గగానే తిరిగి ఉద్యోగులను కార్యాలయాలకు రప్పించేందుకు సన్నాహాలు చేస్తున్నాయి.