భారత్‌కు ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టాలినా జార్జియేవా సలహా

 


 కోవిడ్‌–19 మహమ్మారితో యుద్ధం చేస్తున్న భారత్‌ తక్షణం ప్రజారోగ్యం, పేద ప్రజల కనీస అవసరాలను తీర్చడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్‌) మేనేజింగ్‌ డైరెక్టర్‌ (ఎండీ) క్రిస్టాలినా జార్జియేవా పేర్కొన్నారు. అలాగే లఘు, చిన్న మధ్య తరహా ప్రయోజనాల పరిరక్షణపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. తద్వారా ఆయా సంస్థలను వ్యాపార పరంగా కుప్పకూలకుండా చూడవచ్చని పేర్కొన్నారు. ఆయా చర్యలతో దీర్ఘకాలంలో దేశాన్ని వృద్ధి బాటలో విజయవంతంగా నడిపించవచ్చని విశ్లేషించారు.