ఓయూ పరీక్షలు వాయిదా..

 


 ఈ నెల 14, 15 తేదీల్లో జరగాల్సిన డిగ్రీ, ఇతర కోర్సుల పరీక్షలను వాయిదా వేసినట్లు ఉస్మానియా విశ్వవిద్యాలయ కంట్రోలర్‌ ప్రొఫెసర్‌ శ్రీరామ్‌ వెంకటేశ్‌ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. వర్షాల నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేసినట్లు, ఈ పరీక్షలను తిరిగి నిర్వహించే తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. అయితే ఈ నెల 16వ తేదీ నుంచి జరిగే పరీక్షలు యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేశారు.