కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరం కరీంనగర్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ పథకాలు పేద కుటుంబాలకు వరం అని రాష్ర్ట ఆహార, సివిల్ సప్లై, బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్ లబ్దిదారులకు నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. 258 మంది లబ్దిదారులకు రూ. 2,58,29,928 విలువ గల చెక్కులను మంత్రి అందజేశారు. కష్టకాలంలోనూ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.