మూడు రకాలుగా వర్గీకరణ.. గ్రేడ్ల ప్రకారమే ప్యాకేజీ


ఆరోగ్యశ్రీ ఆసుపత్రులకు గ్రేడ్లు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్ర ప్రాయంగా నిర్ణయించింది. మూడు రకాలుగా గ్రేడ్లు పెట్టి, ఆ ప్రకారం ప్యాకేజీ ధరలను ఖరారు చేయాలని యోచిస్తోంది. ఏ, బీ, సీ గ్రేడ్లుగా ఆయా ఆసుపత్రులను విభజించే అవ కాశాలున్నాయి. ఆరోగ్యశ్రీలో సంస్కరణలు తేవాలని రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా సంస్కరణలు తెచ్చేందుకు విధివిధానాలు తయారు చేయా లని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేం దర్‌ ఇటీవల అధికారులను ఆదేశించారు. తద్వారా ఆరోగ్యశ్రీ, అలాగే ఉద్యోగులు, జర్నలిస్టుల ఆరోగ్య పథకాల (ఈజేహెచ్‌ఎస్‌) లను మరింత బలోపేతం చేయాలని నిర్ణయిం చారు. సంస్కరణలపై మరోసారి నేడో రేపో సమావేశం కావాలని నిర్ణయించారు.