కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆమె స్వీయ గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. తనతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా టెస్టులు నిర్వహించుకోవాలని ఆమె విజ్ఞప్తి చేశారు. 'ఓ ప్రకటన చేసే క్రమంలో పదాల కోసం వెతకడం నాకు చాలా అరుదు. అందుకే నేను చాలా సరళంగా చెబుతున్నా. నాకు కరోనా పాజిటివ్ అని తేలింది. నాతో టచ్‌లోకి వచ్చిన వారందరూ వెంటనే కరోనా పరీక్షలు నిర్వహించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నా' అని స్మృతి ఇరానీ ట్వీట్ చేశారు.