రూపే కార్డుదారులకు ఎన్‌పీసీఐ పండగ ప్రత్యేక ఆఫర్

  

రూపే కార్డుదారులకు ఎన్‌పీసీఐ(నేషనల్ పే


మెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) పండగ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. వివిధ రకాల బ్రాండ్ల ఉత్పత్తులపై 65 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్లను ప్రకటించింది.  సాధారణ షాపింగ్ మొదలుకొని ఫుడ్, ఎంటర్‌టైన్‌మెంట్, హెల్త్, ఫిట్‌నెస్, ఎడ్యుకేషన్, ఫార్మసీ తదితర ఉత్పత్తుల కొనుగోళ్లపై ఈ ఆఫర్ వర్తిస్తుంది. 'Rupay Festive Carnival' పేరుతో ఈ ఆఫర్‌ను పండగల వేళ ఎన్‌పీసీఐ ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఆకర్షణీయమైన డిస్కైంట్లను ప్రకటించింది. సేఫ్, కాంటాక్ట్‌లెస్, క్యాష్‌లెస్ పేమెంట్లను ప్రోత్సహించే క్రమంలో ఈ ప్రత్యేక ఆఫర్‌ను తీసుకొచ్చినట్లు ఎన్‌పీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.