ఐదేళ్ల తరువాత అమ్మఒడికి..!

 


 దర్పణ్‌ యాప్‌.. తెలంగాణ పోలీసుల పనితనానికి నిదర్శనంగా నిలిచింది. టెక్నాలజీలో నిత్యం ముందుండే రాష్ట్ర పోలీసులు.. ఐదేళ్ల క్రితం తప్పిపోయిన బాలుడిని తల్లిదండ్రుల ఒడికి చేర్చి శెభాష్‌ అనిపించుకున్నారు. వివరాలు.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్‌కు చెందిన సోమ్‌ సోని అనే బాలుడు ఆటిజంతో బాధపడుతున్నాడు. అతనికి ఎనిమిదేళ్ల వయసున్నపుడు 2015లో జూలై 14న తప్పిపోయాడు. ఈ మేరకు అలహాబాద్‌లో మిస్సింగ్‌ కేసు నమోదైంది. అక్కడి పోలీసులు ఎంత గాలించినా బాలుడి ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబసభ్యులు కూడా ఆశలు వదులుకున్నారు. కానీ, పిల్లాడు అదే నెల 23న అస్సాంలోని గలాపర పోలీసులకు తారసపడ్డాడు. దీంతో వారు స్థానిక చిల్డ్రన్స్‌ హోంకు తరలించారు.