పండుగ సీజన్‌లో ప్రత్యేక ఆఫర్‌  పండుగల సీజన్‌ నేపథ్యంలో బ్యాంకింగ్‌ దిగ్గజం– స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) తన గృహ రుణాలకు సంబంధించి అవలంబిస్తున్న వడ్డీరేట్లపై 25 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు ఒక శాతం) వరకూ రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించింది. రూ.75 లక్షలకుపైగా రుణం, సిబిల్‌ స్కోర్, బ్యాంక్‌ డిజిటల్‌ లెండింగ్‌ ప్లాట్‌ఫామ్‌ యోనో ద్వారా దరఖాస్తు చేసుకోవడం వంటి అంశాల ప్రాతిపదికన తాజా రాయితీ వర్తిస్తుందని బుధవారం విడుదలైన బ్యాంక్‌ ప్రకటన తెలిపింది.