రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ఆర్ఆర్ఆర్. దాదాపు ఆరు నెలల విరామం తర్వతా తాజాగా ఈ చిత్రం షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆదివారం ఎన్టీఆర్ షేర్ చేసిన ఓ ఫోటో ప్రస్తుతం తెగ వైరలవుతోంది. మూవీ కోసం ఆయన పడుతున్న కష్టం ఈ ఒక్క ఫోటోతో అర్థమవుతోంది. ఫోటోగ్రాఫర్ డాబూ రత్నానితో కలిసి ఎన్టీఆర్ దిగిన ఈ ఫోటో ప్రస్తుతం అభిమానులతో పాటు నెటిజనులను తెగ ఆకర్షిస్తుంది. ‘భీమ్ పాత్ర కోసం ఎన్టీఆర్ ఎంతలా కష్ట పడ్డాడో ఈ షర్ట్‌లెస్ ఫోటో తెలియజేస్తుంది. కొమరం భీమ్ పాత్రపై అంచనాలను మరింత పెంచుతోంది’ అంటూ కామెంట్ చేస్తున్నారు నెటిజనులు. ఇక ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన పాత్రకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేయాలని చిత్ర బృందం భావించింది. కానీ కరోనా కారణంగా షూటింగ్‌లు నిలిచిపోవడంతో అది కుదరలేదు.