ఛేదనలో హైదరాబాద్‌ విఫలం


  ఐపీఎల్‌లో రెండు వరుస పరాజయాల తర్వాత చెన్నై ఖాతాలో మళ్లీ విజయం చేరింది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో చెన్నై 20 పరుగుల తేడాతో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఓడించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న చెన్నై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. షేన్‌ వాట్సన్‌ (38 బంతుల్లో 42; 1 ఫోర్, 3 సిక్సర్లు), అంబటి రాయుడు (34 బంతుల్లో 41; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), స్యామ్‌ కరన్‌ (21 బంతుల్లో 31; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం రైజర్స్‌ 20 ఓవర్లలో 8 వికెట్లకు 147 పరుగులే చేయగలిగింది. కేన్‌ విలియమ్సన్‌ (39 బంతుల్లో 57; 7 ఫోర్లు) అర్ధసెంచరీ చేశాడు. ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన రవీంద్ర జడేజాకు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు దక్కింది.