వెన్నాచెడ్‌లో ‘మంగ్లీ’ సందడి



  మండలంలోని వెన్నాచెడ్‌లో బుధవారం ప్రముఖ టీవీ యాంకర్‌ ‘మంగ్లీ’ సందడి చేశారు. గ్రామ శివారులోని బండమీది రామస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన మంగ్లీ గ్రామంలో ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల షూటింగ్‌లో పాల్గొన్నారు. ఈ విషయం తెలుసుకున్న చుట్టుపక్కల గ్రామాల ప్రజలు షూటింగ్‌లో పాల్గొన్న ‘మంగ్లీ’ని చూసేందుకు తరలివచ్చారు. గద్వాల: నడిగడ్డలో పండించే మామిడికాయలను విదేశాలకు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం కల్పించింది. ఈ ఏడాది ఏడు ఉద్యాన పంటలను ఎగుమతి చేసే ఉద్దేశంతో క్లస్టర్‌ ఆధారిత అభివృద్ధి పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా జిల్లాలోని మామిడితోటలను అధికారులు గుర్తించారు. దీంతో ఏపీఈడీఏకు రైతులు దరఖాస్తు చేసుకుంటున్నారు. జిల్లాలో పండ్లతోటలకు అనువైన పరిస్థితులు ఉన్నాయి. దీంతో ఇక్కడి రైతులు మామిడితో పాటు బత్తాయి, దానిమ్మ, నిమ్మ తోటల పెంపకాన్ని చేపట్టారు. గ్లోబల్‌ గుడ్‌ అగ్రికల్చర్‌ ప్రాక్టీసెస్‌ (జీఏపీ) ప్రమాణాలకు అనుగుణంగా మామిడిని రైతులు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా బంగినపల్లి, దశేరి, దశేరి–35, హిమాయత్, పెద్దరసం, చిన్నరసం, సువర్ణరేఖ, కేసరి, తోతాపురి తదితర రకాలు ఉండాలి. అనంతరం ఎగుమతి కోసం ఏపీఈడీఏ హర్ట్‌నెట్‌ వెబ్‌లో వివరాలు నమోదు చేసుకోవాలి. నిబంధనల ప్రకారం రైతులు వ్యక్తిగతంగా గాని, ఉత్పత్తిదారుల సంఘాలుగా గాని ఏర్పడాలి. ప్రస్తుతం నడిగడ్డలో ఈ ప్రక్రియ కొనసాగుతోంది. జీఏపీ ప్రమాణాలకు అనుగుణంగా మామిడిని పండించి ఎగుమతి చేసేందుకు రైతులు ముందుకు వస్తున్నారు. పది రోజుల నుంచి ఉద్యానశాఖ కార్యాలయానికి వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నారు. ఇంతవరకు 17మంది నుంచి దరఖాస్తులు వచ్చాయని అధికారులు తెలిపారు.