108 మెగా పిక్సల్ తో వస్తున్న షో మీ ఫోన్


 

చైనాకు చెందిన షియోమీ కంపెనీ ప్రస్తుతం బడ్జెట్ సెగ్మెంట్, మిడ్ రేంజి సెగ్మెంట్ లో మొబైల్ ఫోన్స్ ను తీసుకుని వస్తోంది. త్వరలో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ మార్కెట్ లోకి అడుగుపెట్టాలని ఎదురుచూస్తోంది. ప్రస్తుతం శాంసంగ్ ఈ మొబైల్స్ విభాగంగా అందరినీ ఆకట్టుకుంటూ ఉండగా.. త్వరలోనే షియోమీ కూడా ఫోల్డబుల్ స్మార్ట్ మొబైల్ ఫోన్స్ ను తీసుకుని రానుంది. షియోమీ ఇంతకు ముందే 'ఎంఐ మిక్స్ ఆల్ఫా' అనే కాన్సెప్ట్ తో తాము స్మార్ట్ ఫోన్ ను తీసుకుని వస్తున్నట్లు తెలిపింది. ఇప్పటి వరకూ ఈ మొబైల్ ఫోన్ ను భారత్ లోకి తీసుకుని రాలేదు షియోమీ సంస్థ.. అతి త్వరలోనే ఈ మొబైల్ ఫోన్ ను భారత్ లో లాంఛ్ చేయనున్నారు. ఈ మొబైల్ ఫోన్ కు ఫ్లెక్సిబుల్ ఓఎల్ఈడీ డిస్ప్లే ఉంది. ఈ మొబైల్ ఫోన్ ఎంఐయుఐ 12 కోడ్ ద్వారా రన్ అవ్వనుందని తెలుస్తోంది. "Cetus" అనే కోడ్ నేమ్ తో ఈ మొబైల్ ఫోన్ ను రూపొందిస్తూ ఉన్నారు. Cetus ఫోన్ పూర్తిగా ఫోల్డబుల్ మొబైల్ ఫోన్ అని చెబుతూ ఉన్నారు. అన్ని విషయాల్లోనూ జాగ్రత్తలు తీసుకుని మార్కెట్ లోకి తీసుకుని రావాలని షియోమీ సంస్థ భావిస్తోందని టెక్ నిపుణులు చెబుతూ ఉన్నారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ తో ఈ మొబైల్ ఫోన్ పని చేయనుందని అంటున్నారు. 108 మెగాపిక్సెల్స్ ప్రైమరీ కెమెరాతో ఈ మొబైల్ ఫోన్ రానుందని చెబుతూ ఉన్నారు. ఈ మొబైల్ ఫోన్ ధర కాస్త ప్రీమియం రేంజిలోనే ఉండే అవకాశాలు ఉన్నాయని భావిస్తూ ఉన్నారు. Cetus అన్న పేరును అధికారికంగా కూడా ఉంచుతారా.. లేక పేరు మారుస్తారా అన్న విషయం కూడా తెలియాల్సి ఉంది. ఫోల్డబుల్ మొబైల్ ఫోన్స్ మార్కెట్ లోకి షియోమీ సంస్థ కూడా దిగనుందని స్పష్టంగా తెలుస్తోంది. అంచనాలను అందుకుంటుందా లేదా అన్నది కాలమే నిర్ణయిస్తుంది.