ఐపీఎల్ సీజన్ 13 ఫైనల్ గా ఉంది. ఫైనల్లో ముంబై ఢిల్లీ డీ ఈసారి కప్ గెలిచేదెవరు


 

అబుదాబి: ఐపీఎల్‌ 13 వ సీజన్‌ చివరి దశకు చేరుకుంది. ముంబై ఇండియన్స్‌, ఢిల్లీ క్యాపిటల్స్‌ మధ్య ఫైనల్‌ మ్యాచ్‌ దుబాయ్‌ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో మంగళవారం జరుగనుంది. అయితే, ఐపీఎల్‌ విజేత ఎవరనే ఉత్కంఠ ఒకవైపు కొనసాగుతుండగా.. పర్పుల్‌, ఆరెంజ్‌ క్యాప్‌లను గెలుచుకునే ఆటగాళ్లెవరు? అనే ఆసక్తి పెరిగిపోయింది. బ్యాటింగ్‌ విభాగంలో ప్రస్తుతం కింగ్స్‌ పంజాబ్‌ ఆటగాడు కేల్‌ రాహుల్‌ 670 పరుగులతో టాప్‌లో ఉండగా.. ఢిల్లీ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ 603 పరగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఎస్‌ఆర్‌హెచ్‌ ఆటగాడు డేవిడ్‌ వార్నర్‌ మూడో స్థానంలో ఉన్నాడు. రాహుల్‌ కన్నా 67 పరుగుల వెనకబడి ఉన్న ధావన్‌కు ఆరెంజ్‌ క్యాప్‌ చేపట్టే అవకాశాలు ఉన్నాయి.