అన్ని పి .జి పరీక్షలకు పరీక్ష ఫీజు గడువు ఈనెల 19 వరకు


 

హైదరాబాద్ : డిసెంబర్‌లో జరగనున్న అన్ని పీజీ పరీక్షలకు సంబంధించి(సీబీసీఎస్‌, నాన్‌ సీబీసీఎస్‌) ఓయూ పరిధిలోని అన్ని కళాశాలల్లో ఎం.ఏ, ఎం.కామ్‌, ఎమ్మెస్సీ, ఎంఎల్‌ఐఎస్‌సీ, ఎం.ఎస్.డబ్ల్యూ, ఎంసీజే, లైబ్రరీ సైన్స్‌ వంటి పీజీ కోర్సులు చదువుతున్న రెగ్యులర్‌, బ్యాక్‌లాగ్‌ విద్యార్థులు పరీక్ష ఫీజును నవంబర్‌ 19 వరకు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా చెల్లించవచ్చునని యూనివర్సిటీ ఎగ్జామినేషన్స్‌ కంట్రోలర్‌ ప్రొ.శ్రీరామ్‌ వెంకటేశ్వర్లు ఓప్రకటనలో తెలిపారు. రూ.300 అపరాధ రుసుముతో నవంబర్‌ 24 వరకు చెల్లించాలని పేర్కొన్నారు.