సంక్రాంతికి కే జి ఎఫ్ చాప్టర్2


 

KGF 2 In Sankranthi: 2018లో విడుదలై అన్ని భాషల్లోనూ సంచలన విజయం నమోదు చేసుకున్న చిత్రం ‘కేజీఎఫ్‌’. దీనికి సీక్వెల్‌గా తెరకెక్కుతోంది ‘కేజీఎఫ్ 2’. కన్నడ నటుడు యశ్ ప్రధాన పాత్రలో.. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా అక్టోబర్ 23న విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా అది కాస్తా వాయిదా పడింది. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి షూటింగ్‌లు ప్రారంభం కావడంతో.. మిగిలిన చిత్రీకరణను కూడా త్వరగా పూర్తి చేసి.. సంక్రాంతికి విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీకి సంబంధించిన తాజా స్టిల్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, హిందీ బాషలలో ఈ సినిమా విడుదల కానుంది. కాగా, తెలుగులో కేజీఎఫ్ 2 రైట్స్ దాదాపు రూ. 30 కోట్ల వరకు పలికినట్లు తెలుస్తోంది.