ఢిల్లీ : ప్రముఖ మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ల తయారీ సంస్థ హీరో మోటో కార్పొ తమ వినియోగదారుల కోసం విపణిలోకి సరికొత్త బైక్ ను విడుదల చేసింది. ఈరోజు భారత మార్కెట్లో కొత్త ఫీచర్లతో బీఎస్ 6-కంప్లైట్ ఎక్స్ట్రీమ్ 200ఎస్ మోటార్‌సైకిళ్లను అందుబాటులోకి తెచ్చినట్లు హీరో మోటో కార్ప్ సంస్థ ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉన్న కంపెనీ షోరూంల్లో బీఎస్ 6-కంప్లైంట్ ఎక్స్ట్రీమ్ 200ఎస్ బైక్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. హీరో ఎక్స్ట్రీమ్ 200ఎస్ బీఎస్6 మోటార్‌సైకిల్ ఎక్స్‌షోరూం ధర రూ. 1,15,715. ఈ బైక్ మూడు రంగుల్లో లభ్యం కానున్నది.