26 నుండి డీఈడీ ఎగ్జామ్స్

 


హైదరాబాద్‌: జిల్లాల్లోని వివిధ కళాశాలల్లో డిప్లొమా ఇన్‌ ఎలిమెంటరీ (డీఈఐ, డీఈడీ) చదువుతున్న ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు ఈనెల 26 నుంచి డిసెంబర్‌ 10 వరకు థియరీ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈఓ రోహిణి తెలిపారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని, www.bse.telangana.gov.in వెబ్‌సైట్‌ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఆమె సూచించారు.